దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 191 పాయింట్ల లాభంతో 66,546 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 19,722 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.89 వద్ద ట్రేడవుతోంది. ఎల్అండ్టీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.