భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ తేదీలో మార్పు జరిగింది. కొత్త తేదీకి పాక్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రతా సమస్యల దృష్ట్యా నవరాత్రులు అక్టోబర్ 15న ప్రారంభం కానుండగా ఈ మ్యాచ్ తేదీని మార్చారు. ముందుగా ఈ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14న జరగనుంది.అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది.