దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 222 పాయింట్లు నష్టపోయి 65,559 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 19,458 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద కొనసాగుతోంది. కేఎస్బీ, పీటీసీ ఇండస్ట్రీస్, స్టార్ సిమెంట్, పైసాలో డిజిటల్, దిలిప్ బిల్డ్‌కాన్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.