దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 65,956 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 19,605 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.81 వద్ద కొనసాగుతోంది. పవర్ గ్రిడ్, టైటాన్, NTPC, JSW స్టీల్, రిలయన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.