చిన్న పిల్లాడి నుంచి పెద్దవారి వరకూ అందరూ ఇప్పుడు సెల్‌ఫోన్ వాడుతున్నారు. యువతీ యువకులు అయితే గంటలకొద్దీ మొబైల్ లో మాట్లాడుతున్నారు. అతిగా ఫోన్ లో మాట్లాడడం వల్ల మెదడుకు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేడియేషన్ ప్రభావం వల్ల సంతాన సమస్యలు వాటిల్లుతున్నాయన్నారు. మొబైళ్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మొదడులో కణాలు పెరగడమే కాకుండా క్యాన్సర్ కణాల ఉత్పత్తి పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.