పల్నాడు జిల్లాలో డెంగ్యూ లక్షణాలతో ఆదివారం ఇద్దరు మృతి చెందారు. కన్నెగండ్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యశ్వంత్ (15) నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా. డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు అక్కడి వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజుపాలెంకు చెందిన వల్లంశెట్టి శివ (43) అనే వ్యక్తి కూడా డెంగ్యూతో మృతి చెందాడు.