మేషం
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో శిరో బాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.
వృషభం
వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాల్లో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.
మిధునం
సోదరులతో స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
కర్కాటకం
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.
సింహం
నూతన వాహన లాభం ఉన్నది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
కన్య
ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
తుల
అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. నిరుద్యోగ యత్నాల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఒత్తిడి నుండి బయట పడతారు.
వృశ్చికం
అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు రాజీ అవుతాయి.
ధనస్సు
సోదరులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి.
మకరం
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.
కుంభం
విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ యత్నాల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి.
మీనం
మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.