రక్తహీనత ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గడం సహా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలో రక్తంలో హీమోగ్లోబిన్ పెంచే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ గిన్నెలో గ్లాస్ పాలు తీసుకుని ఖర్జూర ముక్కలు, 2 స్పూన్ల నెయ్యి వేసి మరిగించాలి. అవి చల్లారిన తర్వాత పాలలో ఖర్జూరాలు కలిసే వరకూ మిక్సీ పట్టాలి. ఈ పాలను తాగితే రక్తహీనత సమస్య అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.