ప్రతి సీజన్ లోనూ సాధారణంగా ఉండే సమస్య జలుబు. కొన్ని ఇంటి చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఓ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని టీ స్పూన్ చక్కెరతో గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి పడుకునే ముందు తాగితే జలుబు తగ్గుతుంది. అలాగే లవంగాలు, మిరియాలు నీటిలో వేసి కొద్దిగా బెల్లం వేసి కాచుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగితే జలుబుతో పాటు శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయంటున్నారు.