రెండో టీ20లో భాగంగా డబ్లిన్లోని ది విలేజ్ మైదానంలో నేడు ఐర్లాండ్, టీమిండియా జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది.ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తోలుతూ బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.అయితే 186 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్ 152/8 స్కోరు చేసి ఓటమి పాలైంది. ఐర్లాండ్ ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ 72 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసాద్ కృష్ణ, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా, అర్ష్దీప్ ఒక్కో వికెట్ తీశారు.