దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 266 పాయింట్ల లాభంతో 65,700 పాయింట్ల వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 19,523 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, లార్సెన్, టెక్ మహీంద్ర, ఎల్టీఐ మైండ్ ట్రీ కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఎన్టీపీసీ, ఐచర్ మోటర్స్ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.