క్రితం రోజు నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు కూడా నష్టాలతో ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్ ప్రారంభ సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 280 పాయింట్ల నష్టంతో 65,971 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 19,272 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. విప్రో, హిందాల్కో, టెక్ మహీంద్ర, ఎస్బీఐల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.