పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్లు రూ.54,700, 24 క్యారెట్లు రూ.59,670కు చేరుకుంది. వెండి ధర రూ.200 పెరిగి కిలో రూ.80,000కు చేరుకుంది. పండుగల సందర్భంగా ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.