భారత్-పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు మామూలుగా ఎగబడట్లేదు. మంగళవారం తొలి విడతగా ఆన్లైన్లో ఉంచిన టికెట్లన్నీ గంటలోపే అమ్ముడుపోయాయి. సాయంత్రం 6 గంటలకు బుక్ మై షో వెబ్సైట్లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా.. 60 నిమిషాల్లోపే సోల్డ్ ఔట్ అనే మెసేజ్ కనిపించింది. సెప్టెంబర్ 3న మరోసారి భారత్-పాక్ మ్యాచ్ టికెట్లను అమ్మనున్నారు.