దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 65,164 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 19,361 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.68 దగ్గర ప్రారంభమైంది. జియోఫిన్, హిందాల్కో, మారుతీ షేర్లు లాభాల్లో ఉండగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.