గొంతులో కిచ్ కిచ్.. సమస్య చిన్నదే కానీ, దాని వల్ల కలిగే చికాకు భరించడం కష్టమవుతుంది. దీనిని ఇంటి చిట్కాతో అదుపు చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఒక కప్పు గోరువెచ్చని నీరు, 1/4 టీస్పూన్ ఉప్పుతో కలిపి పుక్కిలించండి. మీ గొంతు నొప్పిగా లేదా దురదగా ఉన్నప్పుడు ఇలా చేయవచ్చు. ఉప్పును ఉపయోగించడం వల్ల మీ గొంతు కణజాలం ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇది వైరస్ లను నివారిస్తుంది. కఫం అడ్డు పడకుండా నియంత్రిస్తుంది.