యాపిల్ పండును కోసిన కొద్దిసేపటికే రంగుమారిపోతాయి. అలా రంగుమారిపోకుండా ఉండాలంటే ఇవి చేయండి. కట్ చేసిన యాపిల్ ముక్కలను ఐస్ నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కలు కాసేపటి వరకు తాజాగా ఉంటాయి. యాపిల్‌ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత వెంటనే వాటిని జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి అందులో గాలి తగలకుండా ఉంచాలి. అలా చేయడం ద్వారా రంగు మారవు.