భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌కు నేషనల్ యాంటీ డ్రగ్ ఏజెన్సీ షాకిచ్చింది. డోప్ పరీక్షలో విఫలమవడంతో ఆమెపై నిషేధం విధించారు. ఆమె ఏడాదిలో మూడుసార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైంది. ఇంటర్నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రకారం, ఎవరైనా ఏడాదికి మూడుసార్లు డోపింగ్ పరీక్షల్లో విఫలమైతే నిబంధనలను ఉల్లంఘించినట్లు పరిగణిస్తారు. అందుకే హిమదాస్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.