మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకేను క్రీడా అవినీతి దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. 2020లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్లో ఆటగాళ్లను సంప్రదించి మ్యాచ్లను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించాడనేది అతనిపై ఆరోపణ వచ్చింది. ఇదే ఆరోపణలపై అతడు దేశం విడిచి వెళ్లరాదంటూ మూడు వారాల క్రితమే కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 15 వరకు సేనానాయకే పోలీసులలో అదుపులో ఉంటాడు.