దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో 65,731 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 19,571 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.15 దగ్గర ప్రారంభమైంది. ఎల్అండ్టీ, SBI, భారతీ ఎయిర్టెల్, TCS, టాటా మోటార్స్, ITC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్ నష్టాల్లో ఉన్నాయి.