కొలంబోలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇండియా-పాక్ మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా వర్షం కురవడంతో అభిమానులు ఆందోళన చెందారు. వర్షం వల్ల వికెట్ పాడవకుండా ఉండేందుకు గ్రౌండ్ స్టాఫ్ కవర్స్ కప్పి ఉంచారు. కానీ ప్రస్తుతం అక్కడ వర్షం తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో గ్రౌండ్ స్టాఫ్ కవర్స్ తీస్తున్నారు. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ఆరంభం అవుతుందని అంతా భావిస్తున్నారు.