జీలకర్రతో వీటితో ఐరన్ లభిస్తుంది. దీంతో శరీర కణాలకు ఆక్సిజన్ చేరవేసేందుకు జీలకర్ర సాయపడుతుంది. శరీరం శక్తిని సంతరించుకోవడానికి ఆక్సిజన్ కీలకం. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. విటమిన్ సీ కూడా లభిస్తుంది. మంచి యాంటీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులను తగ్గించడానికి సాయపడుతుంది. గొంతు, అన్న వాహికలో పేరుకున్న కఫం విచ్చిన్నమవ్వడానికి సాయపడుతుంది.