దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సైతం భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. వరుసగా 10వ రోజూ లాభాలను ఆర్జిస్తున్నాయి. సెన్సెక్స్ 276 పాయింట్లు పెరిగి 67,742 పాయింట్లకు చేరింది. అలాగే నిఫ్టీ 90 పాయింట్లు మెరుగుపడి 20,160 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. హిండాల్కో, టాటా స్టీల్, యూపీఎల్, JSW స్టీల్ షేర్లు లాభాల దిశగా పయనిన్నాయి. టాటా ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, సన్ ఫార్మా షేర్లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.