ఆర్థిక మాంద్యం భయం టెక్ దిగ్గజ సంస్థలను ఇప్పట్లో వదిలేలాలేదు. ఇప్పటికే పలు సంస్థల్లో ఈ కారణంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు బుధవారం సదరు ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. అదే విధంగా ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. కొత్తగా ఏ సంస్థలు కూడా నియామకాలు చేపట్టడం లేదని పేర్కొంది.