మేషం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృషభం: ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మిధునం: వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు తప్పవు. ఆర్థికపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కర్కాటకం: కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
సింహం: వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఆటుపోట్లు తప్పవు.
కన్య: ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
తుల: కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఇంటాబయట నిరాశ తప్పదు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి.
వృశ్చికం: ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి.
ధనస్సు: ప్రయాణాలు శ్రమతో కూడుకుని ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
మకరం: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
కుంభం: కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది.
మీనం: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.