మేషం: ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృషభం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులలో శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు.
మిథునం: ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకుంలించవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.
కర్కాటకం: కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. ఉద్యోగమున కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహం: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
కన్య: అనుకోని ప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. సన్నిహితులు ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి.
తుల: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికం: చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యవిషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
ధనస్సు: దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులలో శిరోబాధలు పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తా. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
మకరం: సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం: ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
మీనం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.