రోజ్‌వాటర్ చర్మానికి చాలా రకంగా మేలు చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చి మంచి నిగారింపుని తెస్తుంది. ఈ రోజ్‌వాటర్ క్రిమిసంహారిణిగా కూడా పని చేస్తుంది. రోజ్‌వాటర్‌ని వారానికి రెండు సార్లు చర్మానికి రాసుకుంటే ఎప్పటికప్పుడు వచ్చే అధిక సెబమ్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎరుపు, చర్మశోథ, తామర వంటి వివిధ చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ఇది చర్మంపై మచ్చలు, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. రోజ్‌వాటర్ జుట్టు సంబంధిత సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇది తేలికపాటి స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఇంకా అలాగే చుండ్రుకు చికిత్స చేయగలదు. ఈ రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను ముంచి మీ కనురెప్పలపై అప్లై చేయండి. ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న వేడి తగ్గి మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.