కమలాపురం మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహానికి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నరసింహారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో పాడిపంటలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఉండాలని ఆ దేవుని ప్రార్థించాను అన్నారు.