టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై మంగళవారం కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో రేపల్లెలో టిడిపి నాయకులకు ముందస్తు నోటీసులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, న్యాయవాది యరగళ్ళ ధర్మ తేజకు ముందస్తు చర్యలో భాగంగా మంగళవారం రేపల్లె పోలీసులు 141 నోటీసు అందజేశారు. వైసిపి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు చేస్తుందని న్యాయవాది ధర్మతేజ మండిపడ్డారు.