టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ మళ్లీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్ సూపర్-4లో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్లతో జరిగిన మ్యాచ్లకు అతను దూరమయ్యాడు. శ్రేయాస్ కోలుకుంటున్నా ఇంకా పూర్తిగా ఫిట్ గా లేడని తెలిసింది. వన్డే ప్రపంచకప్ వరకు జట్టులోకి వచ్చినా.. మళ్లీ గాయం కారణంగా బయటకు వెళ్లకూడదన్నది అభిమానుల కోరిక.