బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవినీతి ఆరోపణలు చేసింది. 2021లో అబుదాబిలో జరిగిన టీ10 లీగ్ లో నాసిర్ మరో ఏడుగురితో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఐసీసీ తాజాగా నిర్దారించింది. దీంతో నాసిర్ పై చర్యలకు ఐసీసీ సిద్ధమైంది. కాగా ఇతడు బంగ్లాదేశ్ తరఫున 2011లో అర్రంగేట్రం చేయగా.. 19టెస్టులు,65వన్డేలు, 31టీ20లు ఆడాడు.చివరగా 2017లో బంగ్లాదేశ్ తరఫున ఆడాడు.