భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ మెగా ఈవెంట్ కు ధరించబోయే తమ నూతన జెర్సీని క్రికెట్ ఆస్ట్రేలియా ఆవిష్కరించింది. యెల్లో అండ్ గ్రీన్ కాంబోలో కొత్త జెర్సీ ఆకట్టుకుంటోంది. కాగా, ఆస్ట్రేలియా జెర్సీ స్పాన్సర్ గా ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ ఉంది. జెర్సీ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.