ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గల గంజారిలో కాశీ క్షేత్రాన్నిప్రతిబింబిచేలా రూ.330 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే స్థలం కోసం రూ.121 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 30వేల మంది సామర్థ్యంతో దీనిని 2025 నాటికి పూర్తి చేయనున్నారు.శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యాక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా హాజరుకానున్నారు.