దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల నష్టంతో 65,742 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 19,607 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 దగ్గర ప్రారంభమైంది. సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.