దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 130 పాయింట్ల లాభంతో 65,639 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 19,566 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. NTPC, హిందాల్కో, UPL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, లార్సెన్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్టీఐ మైండ్ ట్రీ, TCS, ఏసియన్ పెయింట్స్, HCL టెక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.