చాలా మందికి 30 ఏళ్లు రాగానే పొట్ట వచ్చేస్తుంది. సరైన వ్యాయామం చేయకపోవడం, కొవ్వు పెంచే ఆహారాలను తినడం దీనికి ప్రధాన కారణం. చక్కెర ఎక్కువగా ఉండే ఐస్‌క్రీములు, స్వీట్లు, కాఫీలు, కూల్‌డ్రింకులు మానేయాలి. ముఖ్యంగా కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉండే పదార్థాలు కొవ్వును పెంచుతాయి. తగిన మోతాదులోనే ఆహారం తీసుకోవడం, నడక, వ్యాయామం పెంచితే పొట్ట కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.