దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:15 గంటల సమయానికి సెన్సెక్స్ 330.62 పాయింట్ల భారీ నష్టంతో 65497.16 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 109.30 పాయింట్ల నష్టంతో 19529.40 వద్ద ట్రేడవుతోంది. టాప్ గెయినర్స్ జాబితాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్తాన్ యూనిలీవర్ ఉన్నాయి.