చెన్నై వేదికగా టీమిండియాతో ఇవాళ జరుగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపా గాయపడ్డాడు. స్వల్ప గాయాల కారణంగా జంపా టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లారిటీ ఇచ్చింది. మరోవైపు హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని స్టోయినిస్ భారత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం అనుమానమేనని తెలుస్తుంది.