వన్డే క్రికెట్లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బాంబు బెదిరింపు ఈ మెయిల్ కలకలం రేపింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో బాంబు దాడి చేస్తామని పేర్కొనడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. స్టేడియం పరిసరాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.