టీమిండియాకు షాకింగ్ న్యూస్. కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న బ్యాటర్ శుభ్మన్ గిల్.. ప్లేట్లెట్స్ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో గిల్ డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.