ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంతో సోమవారం భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నాటికి కోలుకున్నాయి. సెన్సెక్స్-నిఫ్టీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 331.12 పాయింట్లు పెరిగి 65,843.51 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 103.10 పాయింట్లు మెరుగుపడి ప్రస్తుతం 19,615.45 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ఉండడంతో మదుపర్లలో ఆందోళన తప్పింది.