మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. చిన్న చిన్న తప్పుల వల్ల పెద్ద సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ఎక్కువ కారం ఉండే ఆహార పదార్థాలు వంటివి తీసుకుంటే గుండెకు ప్రమాదం. అలాగే ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు, చీజ్ బర్గర్స్ వంటి వాటిని రాత్రి పూట తీసుకోకండి. కెఫిన్ ఉండే కాఫీ చాక్లెట్ వంటి వాటి వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. సిట్రస్ జ్యూస్, పచ్చి ఉల్లిపాయ, టమాట సాస్ వంటి వాటిని రాత్రి తీసుకుంటే హాట్ బర్న్‌తో బాధపడాల్సి వస్తుంది కాబట్టి రాత్రిపూట అస్సలు వీటిని తీసుకోవద్దు.