ప్రతి రోజూ 7 నుంచి 8 గ్లాసుల మంచి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నీరు అస్సలు తాగొద్దట. ఒకవేళ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* పాలు తాగిన తర్వాత నీళ్లు తాగొద్దు. తాగితే జీర్ణక్రియ సమస్యలు వస్తాయట.
* స్ట్రాబెర్రీ పండ్లు తిన్న తర్వాత నీరు తాగితే ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. అందుకే ఈ పండ్లు తిన్న తర్వాత నీరు తాగొద్దు.
* వేరుశెనగ తిన్న తర్వాత నీరు తాగడం హానికరం. వేరుశెనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే జలుబు, దగ్గు వచ్చే అవకాశాలున్నాయట.
* బ్లాక్‌బెర్రీ తిన్న వెంటనే నీళ్లు తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.
* యాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగితే పేగులకు హాని కలిగే అవకాశముందని చెబుతున్నారు.
* పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.