దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 301 పాయింట్ల నష్టంతో 66,106 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 19,723 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం రూ. 83.24 దగ్గర ప్రారంభమైంది. మారుతీ, TCS, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే ఇండియా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి.