నేడు భారత్ తో జరగనున్న పోరుపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ధీమా వ్యక్తం చేశారు. 'ఈ మ్యాచ్ ఫలితం పాక్ కు ప్రతికూలంగా వస్తే కెప్టెన్సీ కోల్పోతానేమో అనే ఆందోళన ఉందా?' అని ఓ వ్యక్తి బాబర్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. 'ఒక్క మ్యాచ్ తో నాకు కెప్టెన్సీ రాలేదు. అలాగే ఒక్క మ్యాచ్ తో నా కెప్టెన్సీ పోదు' అని బదులిచ్చారు. వన్డే ప్రపంచకప్ లో భారత్-పాక్ ఏడుసార్లు తలపడగా.. ఏడుసార్లూ భారతే గెలిచింది.