ఎలాన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ (ట్విట్టర్)కు ఆస్ట్రేలియన్ ఇ-సేఫ్టీ కమిషన్ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు 3లక్షల 86 వేల డాలర్ల జరిమానా విధించింది. సామాజిక మాధ్యమాల్లో చిన్నపిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌పై నిత్యం నిఘా ఉంటుంది. అయితే ఎక్స్, చైల్డ్ అబ్యూస్ కేసుకు సంబంధించిన దర్యాప్తుకు సహకరించక పోవడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వ నియంత్రణ సంస్థ భారీ ఫైన్ విధించింది.