పుట్టగొడుగులు చాలా త్వరగా సన్నగా, నల్లగా మారుతాయి. అలా మారకుండా కాగితపు సంచుల్లో పుట్టగొడుగులను నిల్వ చేయవచ్చు. చిన్న రంధ్రాలు చేసిన కాగితం సంచిలో పుట్టగొడుగులు ఉంచి, ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువరోజులు పుట్టగొడుగులు తాజాగా ఉండే అవకాశం ఉంది. ఫ్రిజ్ లో సువాసన వచ్చే పదార్థాల దగ్గర మష్రూమ్ ఉంచకూడదని గుర్తుపెట్టుకోండి.