యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ తన స్పిన్ మాయాజాలంతో అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శన చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న అతడు మధ్యప్రదేశ్ పై 4 ఓవర్లకు 13 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. అతడి ధాటికి మధ్యప్రదేశ్ 20 ఓవర్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లోనూ KKR తరఫున బరిలోకి దిగిన సుయాశ్ శర్మ అరంగేట్ర మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించారు.