దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో 66,305 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 19,781 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సిప్లా, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అపోలో, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, టాటా కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.