వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్‌లో జరిగిన ఘటనలపై ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు తాజాగా ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 14న జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో పాక్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ భారత్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారని పేర్కొంది. పాక్ జర్నలిస్టులు, క్రికెట్ అభిమానులకు వీసాల జారీలో జాప్యంపైనా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని పీసీబీ మీడియా తాజాగా ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపింది.